హుస్నాబాద్ లో ఘనంగా బహుజన బతుకమ్మ వేడుకలు
ఆత్మగౌరవంతో జీవించడం మహిళల హక్కు
వెలివాడలు కాదు.. తొలి వాడలంటూ చాటేదే బతుకమ్మ
ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, విమలక్క
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

మహిళలు ఆత్మగౌరవంతో జీవించినప్పుడే సార్దకత ఏర్పడుతుందని మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులను నిరసిస్తూ స్త్రీలను గౌరవంగా జీవించే హక్కును చాటి చెబుతూ వెలివాడలు కాదు.. తొలి వాడలంటూ చాటేదే బహుజన బతుకమ్మ అని తెలియజేస్తూ అసమానతులను ప్రతిఘ టించడం ఆత్మగౌరవంతో జీవించడం మహిళల హక్కు అంటూ చాటుదాం అనే ఉద్దేశంతో హుస్నాబాద్ పట్టణంలో సోమవారం బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మం త్రి పొన్నం ప్రభాకర్ మరియు అరుణోదయ విమలక్క హా జరయ్యారు. ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడి పాడారు. అరుణోదయ విమలక్క తన పాటలతో మంత్రముగ్ధులను చేశారు. అనంతరం శాలువాతో మహిళలు విమలక్కను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ కేంద్రంగా బహుజన బతుకమ్మ కార్య క్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి విమలక్క రావడం బతుకమ్మ వేడుకలు వారు పాల్గొనడం ఆనందదాయకమన్నారు. మహిళలందరూ నిండు మనసుతో ఆడాలని అప్పుడే ఆ మాత ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మను పెద్ద పూల లాగా జరుపుకుంటారని ప్రజ లందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరికీ శుభం జరగాలని అమ్మ వారిని వేడుకున్నారు. మహిళ లందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి మంజుల, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, పిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత, వాల సుప్రజ, భూక్య సరోజన, పున్న లావణ్య, డిసిసి కార్యదర్శి చిత్తారి రవీందర్, పట్టణ మాజీ అధ్యక్షుడు డా.అక్కు శ్రీనివాస్, ఆయా మండలాల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, కంది తిరుపతిరెడ్డి, మంద ధర్మయ్య, నాయకులు రాచకొండ చక్రధర్‌రావు. శెట్టి సుధాకర్, దొమ్మాట జగన్‌రెడ్డి, భీంరెడ్డి తిరుపతిరెడ్డి, అబ్దుల్ రఫీక్, బూరుగు కిష్టస్వామి, వెన్న రాజు, గుగులోతు రాజునాయక్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.