ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన మరియు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేయాలి
బీసీ సంక్షేమ సంఘం హుస్నాబాద్ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ కులగణన మరియు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేయాలని, ఒకవేళ అమర్న నిరాహార దీక్ష చేసే వారు ప్రాణానికి ఏమైనా హాని కలిగితే బీసీ సామాజిక వర్గ అగ్రహ జ్వాలకు గురిగాక తప్పదని బీసీ సంక్షేమ సంఘం హుస్నాబాద్ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ హెచ్చరించారు.
గత ఐదు రోజులుగా బీసీల కుల గణన చేయాలని, స్థానిక ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ బీసీల కొరకు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేయాలని ప్రభుత్వం ప్రయత్నించి, అరెస్టు చేసి గాంధీ హాస్పిటల్ కు తరలించిన కూడా పట్టు వదలకుండా అమరన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని, ఈ దీక్షకు రాజ్యసభ సభ్యులు R. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి పార్టీ బీసీ మోర్చా అధ్యక్షులు అనిల్ గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారని అన్నారు.