రేపటినుండి తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలు చేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు & పెళ్లి ఐన వారు తమ పేరు నమోదు చేయుటకు రేపటి నుండి మీసేవలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉన్నవారు కూడా పేరు కరెక్షన్ చేసుకోవచ్చు, కొత్త రేషన్ కార్డు వాళ్ళు మాత్రం మరో వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డు లో తప్పులు సరి చేయుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యాజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్ళగలరు అని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
Ration card transfer also please accepted ration card transfer