ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి పట్టింపు లేదు
ప్రభుత్వ కొనుగోలు లేకనే ధాన్యం దళారుల పాలు
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రైతులు అనేక పెట్టుబడులు పెట్టి కష్టపడి పని చేసి పండించి పంటను అమ్ముకుందాం అనుకుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం లో కొనుగోలు చేయకపోవడం తో రోజులు తరబడి కేంద్రం లో కాలం గడపాల్సి వస్తుందని బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గం అధికార ప్రతినిది అయిలేని మల్లికార్జున రెడ్డి బి ఆర్ యస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరంపెల్లి పర్శరాములు ఆరోపించారు సోమవారం రోజున హుస్నాబాద్ మండలం మహ్మదపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం లో రైతులు తీసుకొని వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా బి ఆర్ యస్ పార్టీ నాయకులు మాట్లాడుతుా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం లో కొనుగోళ్లు వేగవంతం గా లేకపోవడం వలనే రైతులు నష్టం పోతున్నరని, అరపోసిన ధాన్యం తేమ శాతం ప్రభుత్వం నిబంధనల ప్రకారం 16 శాతం రావడం జరుగుతుంది అయినా కొనుగోలు జరుగడం లేదన్నారు. రైతులు ఎప్పుడు వర్షం వస్తుందో అని భయం తో కాలం గడుపలిసి వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పై దృష్టి పెట్టడం లేదు కనీసం ఎక్కడ కూడ కొనుగోలు కేంద్రాలను పరిశీలించ లేదు అని అన్నారు. హుస్నాబాద్ ఉమ్మడి మండలం లో కొనుగోలు కేంద్రలలో ఇంకా కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జరిగి పదిహేను రోజులు గడిచిన కూడా కొనుగోళ్లు లేక ఎక్కడ ధాన్యం అక్కడనే నిలిచిపోయాయని, నియోజకవర్గం లో ఎంత ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కొనుగోలు లేకపోవడం వలన ధాన్యం అంత దళారుల పాలవుతుందని అన్నారు. ఇప్పటి కే సగానికి పైగా రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని దళారులు ధాన్యాన్ని కొనుగోలు చేశారని, కనీసం ప్రభుత్వం ఇప్పటి కైన మంత్రి పొన్నం ప్రభాకర్ కొనుగోలు కేంద్రాలను పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గం అధికార ప్రతినిది అయిలేని మల్లికార్జున రెడ్డి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరం పర్శరాములు నాయకులు కొమ్మేర నర్సింహా రెడ్డి ఎల్లయ్య మరియు రైతులు పాలుగోన్నారు.