నిషేధిత గుట్కా.. పాన్ మసాలా వ్యాపారస్తులపై పోలీసుల దాడి..
రహస్యంగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది..
సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్
అనుమతులు లేని పాన్ మసాలా, గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా రహస్యంగా సమాచారం తెలుసుకున్న వ్యాపారస్తులపై టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేసిన సంఘటన జగదేవపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.. వివరాలోనికి వెళితే జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సహస్ర, శంకరయ్య, పుల్లూరి నర్సయ్య, శ్రీనివాస కిరణాల కొట్టులల్లో గత కొంత కాలంగా అనుమతులు లేని గుట్కా, పాన్ మసాలాలు రహస్యంగా అమ్ముతున్నారని తెలుకొని మంగళవారం రోజున దాడులు నిర్వహించారు. షాపుల్లో సోదాలు నిర్వహించగా నిషేధిత పాన్ మసాలా, గుట్కా ప్యాకెట్లను లభించగా అట్టి గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.