దేవుడికే షేఠగోపం.. పేట్టిన కుటుంబం..
వంశపార్యంపర ధర్మకర్తగా ఎలా కొనసాగుతారు..
వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను కాపాడాలి..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; జూలై 28



సిద్దిపేట మోహినిపుర శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తులను కాపాడాలని, అలాగే దేవాలయంలో వంశపార్యం పర ధర్మకర్తగా ఉన్నటున్న వారికి దేవాలయం తో ఎలాంటి సంబంధం లేదని సిద్దిపేటకు చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు ఉడత మల్లేష్ యాదవ్ అన్నారు. 1975లో సిద్దిపేటకు చెందిన కొంతమంది పుర ప్రముఖులు, పెద్దలు మోహిని పురచెందిన కొంతమంది కలిసి దేవాలయం నిర్మించారని, ఈ నిర్మితమైన దేవాలయం ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరిగిందన్నారు. ఆ సమయంలో రెవెన్యూశాఖలో పనిచేసిన వెంకట నరసయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమి అయిన 1340 సర్వే నంబర్ లో ఐదు ఎకరాల భూమిని తన పేరు మీద చేయించుకున్నాట్లు తెలిపారు. తను మోహినిపూరలో నివాసం ఉండడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండోమెంట్ శాఖలో తనకు ఉన్న పలుకుబడితృ దేవాలయం లో తన పేరు నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ ఏదైనా ఇస్తేనే మీరు శాశ్వత ట్రస్ట్ గా ఉంటుందని తెలుపగా… ఆక్రమించుకున్నటువంటి 1340 సర్వే నెంబర్ లో 5 ఎకరాల భూమిని దేవాలయంపై రాసి వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఐదు ఎకరాల భూమిలో సాగు చేస్తున్నటువంటి దానిని దేవాలయం భక్తులు ఇచ్చిన విరాళాలతో ఖర్చులు చేసి ఐదు ఎకరాల భూమిలో మామిడి తోటలు సాగుచేశారని తెలిపారు. తర్వాత కొన్ని రోజులకు దాన్లో నుండి ఇది మా సొంతమని చెప్పి నాలుగు ఎకరాలు తన కొడుకుల పేరు పై చేసి మొత్తం భూమి అమ్ముకున్నారని స్పష్టం చేశారు. దేవాలయం కు రాసిన భూమిని ఆమ్ముకుని, అటు దేవునికి షేఠగోపం పెట్టిన వెంకట నరసయ్య కుటుంబం వంశపార్యం పర ధర్మకర్తగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ భూమి దేవాలయందే అయితే దేవాలయంకే ఉండాలి.. లేదంటే దీనిపై సమగ్ర విచారణ జరిపి దేవాలయ ఆస్తులను కాపాడాలని, గత 50 సంవత్సరాలుగా సిద్దిపేట ప్రజలను, భక్తులను దేవాదాయ శాఖ అధికారులను మభ్యపెట్టి మోసం చేసి వంశపార్యం పర్య ధర్మకర్తగా కొనసాగుతూ దేవాలయానికి భక్తులు ఇచ్చిన కానుకలు అన్నిటిని తింటూ ప్రజలను మోసం చేసిన కుటుంబం సిద్దిపేట ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ధర్మకర్త నుంచి తొలగిపోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా కార్యనిర్వాహణాధికారికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే ప్రజా పోరాటం చేసి అన్యాయకరతమవుతున్న దేవాలయ ఆస్తులను, హక్కులను కాపాడడానికి సిద్దిపేట ప్రజలందరినీ సన్నద్ధం చేస్తామన్నారు.