చరిత్ర విభాగంలో హుస్నాబాద్ వాసి గీత కు డాక్టరేట్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగ పరిశోధకురాలు కె గీత కు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ డాక్టరేట్ ను ప్రకటించారు. డాక్టర్ గీత “ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ – ఏ స్టడీ ” అనే అంశంపై చరిత్ర విభాగం రిటైర్డ్ ఆచార్యులు ఆచార్య ఎస్ శ్రీనాథ్ పర్యవేక్షణలో తన సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ గీత ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. డాక్టర్ గీతకు ఆచార్య మనోహర్, చరిత్ర విభాగం అధ్యాపకులు పరిశోధకులు, ప్రిన్సిపల్ డాక్టర్ డి. కవిత సహధ్యాపకులు కుటుంబ సభ్యులు బంధువులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.






