గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న తెలిపారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన పట్టణంలో ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉత్సవ నిర్వహణకు కావలసిన అనుమతులు పొందాలని సూచించారు. రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకుండ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మండపంలో కరెంటు గురించి ఎలక్ట్రికల్ వారి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. డీజే లు వాడకూడదని, డీజె లు వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ పెరిగి చుట్టుప్రక్కల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు పట్టణంలోని స్టీల్ బ్యాంకు ను ఉపయోగించుకోవాలని, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజించి, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని, వెలుతురు ఉన్నప్పుడే వినాయకుని నిమజ్జనం చేసుకోవాలని, పట్టణ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని స్నేహపూర్వక వాతావరణం లో నిమజ్జనం చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనం ఈనెల 16 న అనగా సోమ వారం రోజున చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, MRO రవీందర్ రెడ్డి, SI మహేష్ , కౌన్సిలర్లు నళినీ దేవి, స్వర్ణలత, పద్మ, వేణు, మ్యదరబోయిన శ్రీనివాస్, రవి, వల్లపు రాజు,బొజ్జ హరీష్, మునిసిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, గణేష్ మండప నిర్వహకులు పాల్గొన్నారు.