గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..
ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం..
సిద్దిపేట టైమ్స్, గజ్వేల్
విధుల నిర్వహణకు బైక్ పై వెళుతూ ఇద్దరు కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గజ్వేల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. గుర్తులేని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తుండగా కానిస్టేబుల్స్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాయప్రోల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2004 బ్యాచ్ కు చెందిన పరంధాములు 43, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 2007 బ్యాచ్ కు చెందిన పూస వెంకటేశ్ 42 ఏపీ 16 బిఎన్ 92 15 బైక్ పై జాలిగామ వైపు నుండి గజ్వేల్ వైపు ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వీరు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు, గాడి చర్లపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. విధులు నిర్వర్తించడానికి వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.





