దోమల నివారణకు “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమం
సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 10 వ వార్డ్ లో “డ్రై డే ఫ్రైడే మరియు సఫాయి ఆఫ్న భీమారీ భగావో” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై వైస్ చైర్ పర్సన్, వార్డ్ కౌన్సిలర్ లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పాత కుండాలలో, పాత డబ్బాలలో, పాత రంజాన్ లలో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తూ, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన చేశారు. అనంతరం వార్డు లో మినీ ట్యాంకుల వద్ద, వాటర్ నిల్వ ఉన్న వద్దా, చిత్తడి ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలో కలుషిత నీరు ఉండకుండా స్వయంగా పర్యవేక్షించారు, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొవాలని సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవలని అందరూ ఆరోగ్య విషయంలో దోమల బారిన పడకుండా శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ కాలనీ వాసులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనితా రెడ్డి , కౌన్సిలర్ గోవిందు రవి, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్ కల్యాణి, ఆర్పి పద్మ, ఆశా వర్కర్, అంగన్వాడి టీచర్, జవాన్లు సారయ్య, ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

