మద్యం మత్తులో ఇద్దరి వ్యక్తులను తీవ్రంగా గాయపరిచిన నలుగురు యువకులు అరెస్ట్..
ఏ.సి.పి.మధు..
సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను నలుగురు యువకులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన దుబ్బాక పట్టణ శివారులోని గంగమ్మ గుడి వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏసిపి మధు తెలిపిన వివరాల ప్రకారము విష్ణు, మహమ్మద్ రాషాద్ అనే ఇద్దరు యువకులు వారి కారులో గంగమ్మ గుడి వద్ద ఉండగా, దుబ్బాక పట్టణానికి చెందిన నలుగురు యువకులు దేవుని రమణ, పర్స భాస్కర్, రాచమల్లు వినోద్ అలియాస్ బొమ్మ, ఆలేటి శరత్ అనే నలుగురు యువకులు తీవ్రంగా మద్యం తాగి, లచ్చ పేట నుంచి దుబ్బాకకు కారులో వస్తున్నారు. గంగమ్మ గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కారులో ఉన్న విష్ణు ,మహమ్మద్ రాషాద్ లను అడ్డగించి, బీరు బాటిలతో వాళ్లపై విచక్షణారహితంగా దాడి చేశారు దానితోపాటు వారి కారును విచక్షణ రైతంగా ధ్వంసం చేశారు. ఈ నలుగురి దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి స్థానికులు వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తము తరలించి, దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి, అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహమ్మద్ రసాద్ భార్య నశ్రీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారిని రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకొని, ఈ దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. సిఐ శ్రీనివాస్, ఎస్సై గంగరాజు హెడ్ కానిస్టేబుల్ హరి సింగ్ ,కానిస్టేబుల్ రాంజీ, శ్రీనివాస్, అశోక్, హోంగార్డ్ గణేశ్ తదితరులు ఉన్నారు.