అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ కొంతకాలంగా అధిక రక్తపోటు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఢిల్లీలో ఇటీవలే చికిత్స పొంది వచ్చారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.