శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, సతీసమేతంగా తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం లోని శ్రీమల్లికార్జున స్వామి సహిత భ్రమరాంబికా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, సతీష్ కుమార్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు సతీష్ కుమార్ కు, ఆయన సతీమణి డాక్టర్ వొడితల షమితకు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్లు సతీష్ కుమార్ తెలిపారు.