బాధిత కుటుంబాలను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ లో డాక్టర్ లేని అనాటి కాలంలో సుదీర్ఘ కాలంగా ఆర్.ఎం.పి.డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలు అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు డాక్టర్ బొద్దున రంగయ్య గత శుక్రవారం నాడు మరణించడం తననేంతగానొ కలిచి వేసిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
మంగళవారం నాడు ఆయన డాక్టర్ బొద్దున రంగయ్య కుటుంబ సభ్యులు బొద్దున అనసూర్య, రవిందర్, శ్రీనివాస్, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి పూదరి మల్లయ్య సతీమణి వజ్రవ్వ గత శనివారం నాడు అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ సభ్యులు పూదరి ప్రకాశ్, లక్ష్మి నారాయణ, రవిందర్, సిపిఐ నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి డాక్టర్ బొద్దున రంగయ్య, పుదరి వజ్రవ్వ చిత్ర పటాలకు పుల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బొద్దున రంగయ్య, పుదరి మల్లయ్యతో విడదీయని బంధంమని అనాటి కాలంలొ కలిసి ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తు కోస్తున్నాయని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం మనోధైర్యం చాడ వెంకటరెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్,
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి ఎగ్గోజు సుదర్శన్ చారి,ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్,భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.