చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి విద్యార్థుల అవగాహన కార్యక్రమం శనివారం సిద్దిపేట మెట్రో గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఓ చిన్నరి తన తండ్రి మరణించారని.. తన భాద్యతలు తన తల్లి కష్టపడి చూసుకుంటూ.. చదివిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది.. ఆ చిన్నారిని ఓదారుస్తూ.. హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యం పలువురి కదిలించింది..
