హుస్నాబాద్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లో రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శుక్రవారం పలువురు ఆత్మీయుల వివాహాది శుభకార్యాలకు, నూతన గృహప్రవేశానికి హాజరైనారు. ముందుగా కౌన్సిలర్ భాగ్యరెడ్డి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో అడ్వకేట్ పిట్టల దేవదాసు కూతురు వివాహానికి హరీష్ రావు, మాజీ శాసన సభ్యులు ఓడితల సతీష్ కుమార్ తో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.