తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి “రాష్ట్ర పద్మశాలి సంఘం” ఎన్నికలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు బూర్ల రాజయ్య తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, మండలాల పద్మశాలి కులస్తులు శివ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 436 ఓట్లు ఉండగా 315 ఓట్లు పోలైనట్లు తెలిపారు.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా, అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనట్లు, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
సుమారు 72 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. సమయం నాలుగు గంటల తర్వాత పోలింగ్ సిబ్బంది పోలింగ్ బాక్స్లు సీల్ చేసి, సంబంధిత పత్రాలు పూర్తి చేశారు. అనంతరం పోలింగ్ బాక్సులు జిల్లా కేంద్రానికి తరలించారు.
తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల లెక్కింపును ఆగస్టు 19, 2024 సోమవారం రోజు హైదరాబాదులోని TRPS సంఘ కార్యాలయంలో లెక్కించనునట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలలో హుస్నాబాద్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కోమటి సత్యనారాయణ జిల్లా నాయకులు గాజుల భగవాన్ నేత, వడ్డేపల్లి బాలయ్య, చింతకింది శ్రీనివాస్, మోర శ్రీహరి, వెళ్దండి లక్ష్మీపతి, మండల నాయకులు పంతం కన్యాకుమారి, సబ్బని శ్రీదేవి, గోలి నారాయణ, బూట్ల సత్యనారాయణ, వడ్డేపల్లి లక్ష్మయ్య, చిప్ప ప్రభాకర్, గుత్తికొండ వేణు, వివిధ మండలాల పద్మశాలి బాద్యులు తదితరులు పాల్గొన్నారు.
