బాణాసంచా విక్రయదారులు అనుమతి తీసుకోవాలి
హుస్నాబాద్ ఏసీపి సదానందం
సిద్దిపేట టైమ్స్ చేర్యాల ప్రతినిధి :
బాణాసంచా విక్రయదారులు తప్పకుండా అనుమతి తీసుకుని విక్రయాలు చేయాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. గురువారం ఏసీపి మాట్లాడుతూ ప్రజల భద్రత, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. డివిజన్ స్థాయిలో విక్రయదారులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా బాణాసంచా నిల్వచేసిన దుకాణాలను నెలకొల్పిన సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దుకాణాలను రద్ది ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు, వివాదాస్పద స్థలాలలో, ప్రజలు నివసించే ప్రాంతాలలో ఏర్పాటు చేయకుండా ఉండాలని అన్నారు. సంబంధిత అధికారులు, ఫైర్ విభాగం,పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాలలో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటూ విక్రయాలు చేయాలని అన్నారు.





