సిద్దిపేట కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో గల బాలాజీ బార్ లో అగ్నిప్రమాదం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ రోడ్డులో గల బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ లో షార్ట్ సర్కిట్ తో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. బార్ లోని ఖరీదైన మద్యం బాటిల్స్ ప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు, కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లిన ట్లు బార్ యజమాని తెలిపారు.
