స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి,
స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు.. చిన్నకోడూరు మండలం చిన్నకోడూరు గ్రామానికి చెందిన ఎండి అజీమ్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా.. మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1994-95 ఎస్ఎస్సి పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతని భార్యకు రూ. 60 వేలు పోగుచేసి అందజేశారు. భవిష్యత్ లోనూ అతని భార్యాపిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అజీమ్ స్నేహితులను చిన్నకోడూరు గ్రామస్తులు అభినందించారు. సహాయం అందజేసిన వారిలో నాగరాజు, విజయ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రం, రమేష్ , పెద్ది రాజు, జే రమేష్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.