వరదలో చిక్కుకున్న రైతులు.. రంగంలోకి దిగిన ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం..
సిద్దిపేట టైమ్స్ అక్బర్ పేట/భూంపల్లి
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్బర్ పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరిగింది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాల వద్దకు వేల్లిన రైతులు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన యెస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రైతులను కాపాడ్డానికి బోటు సహాయంతో రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నం ప్రారంభించారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు.. రైతులకు ఇబ్బందులు కలగకుండా సేఫ్ గా ఒడ్డుకు తీసుకొస్తామని జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహశీల్దార్ మల్లికార్జున్, సిఐ శ్రీనివాస్ లు తెలిపారు. గ్రామస్తులు , కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని సూచించారు.







