సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండాకు చెందిన రైతు భూక్యా శివలాల్(50) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ భూమిలోని బావి దగ్గర చెడిపోయిన మోటర్ స్టార్టర్కు కొత్త స్టార్టర్ బిగిస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే పడిపోయి చనిపోయిన విషయాన్ని చాలాసేపటికి స్థానికులు గమనించి 108 వాహనానికి తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి మృతి చెందాడని ధ్రువీకరించారు. మృతుడికి భార్య దేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన గిరిజన కుటుంబానికి యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందించాలని భారతీయ కిసాన్సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు కవ్వ వేణుగోపాల్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.