ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. చనిపోయే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతు
నేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం బట్టి కి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ రైతు ఆత్మహత్య..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో జరిగిన సంచలన ఆత్మహత్య
రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్థాపనతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేసిన మృతుడు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య శరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు.





