ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి

సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

పెండింగ్ పనులపై తీవ్ర అసంతృప్తి. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి

సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :


రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీ గా హుస్నాబాదును నిలపడానికి అందరూ కస్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణంలో పెండింగ్ పనులు, పూర్తయిన పనులు ఇతర అంశాలపై హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్లు , డ్రైనేజీ నిర్మాణాలు,కమ్యూనిటీ హాల్ లు , ఎల్లమ్మ చెరువు సుందరీకరణ , డివైడర్ ల మధ్య సెంట్రల్ లైటింగ్ ,మొక్కల పెంపకం ,జంక్షన్ ల సుందరీకరణ పనుల పురోగతి పై ఆరా తీశారు. పెండింగ్ పనుల ఆలస్యం పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ రోడ్ల పెండింగ్ పనులు డిసెంబర్ 31 లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు మార్చ్ 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్దేశ్వర ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులకు టెక్నికల్ ఇష్యూ లేకుండా సమస్య పరిష్కారం చేయాలన్నారు. పద్మశాలి , గౌడ , బంజారా , మైనార్టీ , వైశ్య, విశ్వ బ్రాహ్మణ, రెడ్డి , మున్నూరు కాపు ,రజక, యాదవ కమ్యూనిటీ హాల్ లో పెండింగ్ లో ఉన్నాయని ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం కావాల్సి ఉందని, వాటి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం పట్టణంలో పూర్తయిన పనులు,ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు,ప్రతిపాదనలు చేయాల్సిన వాటిపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.ఇందులో మున్సిపల్ అధికారితో పాటు ,రెవెన్యూ శాఖ నుండి ఒకరు ,ఆర్ అండ్ బి నుండి ఒకరు ఉంటారు. ఈ కమిటీ డిసెంబర్ 15 లోపు ఇచ్చే నివేదిక ద్వారా భవిష్యత్ లో చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్ పనులు వేగవంతం చేయవచ్చని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
మల్లె చెట్టు నుండి ఎల్లమ్మ చెరువు రోడ్డు పనులు ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. హైవే మీద డివైడర్ల మీద సెంట్రల్ లైటింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. డివైడర్ల పై చెట్లు,జంక్షన్ ల వద్ద విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.  నెహ్రూ విగ్రహం వద్ద ఎత్తు పెంచి ఎత్తైన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేసి అందులో ఇన్నోవేటివ్ గేమ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  హుస్నాబాద్ లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్న పూల మొక్కలు నాటాలని సూచించారు. గతంలో భారీ వర్షాలు టౌన్ ముంపుకు గురయ్యేదని ఈసారి అంత భారీ వర్షం కురిసిన పట్టణంలో వచ్చిన నీరు వచ్చినట్టు వెళ్లేలా తీసుకున్న చర్యల ద్వారా ముంపుకు గురికాలేదని సిబ్బందిని అభినందించారు. స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు .పల్లె చెరువు బ్యూటిఫికేషన్ పూర్తి చేసి వాకింగ్ ట్రాక్ ,అలంకరణ మొక్కలు నాటాలని తెలిపారు. త్వరలోనే హుస్నాబాద్ మున్సిపాలిటీ కి రింగ్ రోడ్డు మంజూరు అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి , మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ మరియు అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *