ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి
– మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
– ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి
– డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడరాదు
– దుబ్బాక ఎస్సై గంగరాజు వెల్లడి
సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
ప్రతి ఒక్కరూ వాహనాలను వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపారు. బుధవారం రోజున మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెషనల్ ఎస్సై కీర్తి రాజుతో కలిసి వాహనదారులకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పకుండా ధరించాలని , మద్యం సేవించి వాహనాలు నడపకూడదని , కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి అన్నారు. డ్రైవరు వాహనాలు నడిపే సమయంలో ఉపయోగించరాదని, వాహనంలో అధికలోడును తీసుకెళ్లరాదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని ఒకవేళ ఇచ్చినట్లయితే చట్టారిత్య నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బిక్షపతి, గణేష్ వాహనదారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి
