పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 14వ వార్డులో డ్రై డే ఫ్రైడే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై మున్సిపల్ కమిషనర్ తో కలిసి వార్డులో మున్సిపల్ సిబ్బందితో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లించడం కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున గౌడ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, వార్డ్ ఆఫీసర్ పద్మ, సాంబరాజు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
