హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు…
2025-2026 విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగా హుస్నాబాద్ కి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మంజూరు చేస్తూ జీవో నెంబర్ 18 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి, యూనివర్సిటీ కి లా కాలేజి మంజూరు చేశారు.
హుస్నాబాద్‌లో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శాతవాహన యూనివర్శిటీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.44.12 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శాతవాహన విశ్వవిద్యాలయం – 2025-2026 విద్యా సంవత్సరం నుండి హుస్నాబాద్‌లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్థాపనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. B. Tech (CSE) – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3) B.Tech (IT) మరియు 4) B.Tech (ECE) ప్రతి ప్రోగ్రామ్‌లో 60 మంది విద్యార్థులను తీసుకుంటారు.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత శాతవాహన యూనివర్సిటీ కి ఇంజనీరింగ్ కాలేజి, లా కాలేజి మంజూరు చేయడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మంజూరు కావడం పట్ల హుస్నాబాద్, కరీంనగర్ ప్రజలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు.