హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో “ప్రమాద రహిత వారోత్సవాల” ముగింపు
ముఖ్యఅతిథిగా హాజరైన హుస్నాబాద్ MVI కొండలరావు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా లోని హుస్నాబాద్ ఆర్టీసీ డిపో లో మేనేజర్ డి సి హెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో “ప్రమాద రహిత ముగింపు వారోత్సవాలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక MVI కొండలరావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం మాట్లాడుతూ ఇట్టి ప్రమాద రహిత వారోత్సవాలు 24.07.2024 నుండి 30.07.2024 వరకు నిర్వహించామని, డ్రైవర్లు డ్యూటికి బయలుదేరే ముందు బస్సు యొక్క కండిషన్, బ్రేక్స్, వై ఫర్ లను చెక్ చేసుకోవాలని వర్షాకాలంలో రోడ్స్ జారుతూ ఉంటాయి మరియు వర్షానికి గుంతలు ఏర్పడతాయి వాటిని గమనించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయగలరని, వేగ నియంత్రణ పాటిస్తూ చౌరస్తాల వద్ద జాగ్రత్త వహిస్తూ డ్రైవింగ్ చేయాలని పలు సూచనలు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన MVI కొండలరావు మాట్లాడుతూ.. ప్రయాణికులను వారి యొక్క గమ్యస్థానానికి చేరవేసే అతి పెద్ద సంస్థ ఆర్టీసీ సంస్థ. ప్రజల్లో ఆర్టీసీ డ్రైవర్లకు మంచి స్థానం ఉంది. కావున డ్రైవర్లు అతి జాగ్రత్తతో నడపాలని, వర్షాకాలంలో డ్రైవింగ్ ఎలా చేయాలని పలు సూచనలు చేశాడు.
ఇందులో భాగంగా ఈ సంవత్సరానికి గాను యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సన్మానించారు, ఈ కార్యక్రమం తో పాటుగా మే, జూన్ ,జూలై నెలలకు సంబంధించిన నెట్ కాష్ ఎక్కువ తీసుకువచ్చిన డ్రైవర్ మరియు కండక్టర్లకు అవార్డ్స్ అందజేశారు. అలాగే “లక్షే లక్ష్యంలో” భాగంగా డిపో నందు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, జూన్ నెలకు సంబంధించి ‘ప్రగతి చక్ర అవార్డ్స్ మరియు బెస్ట్ ఎప్క్ క్యాష్ అవార్డ్స్’ మరియు ‘యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లకు’ MVI బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలోమెకానికల్ సూపర్వైజర్, ట్రాఫిక్ సూపర్డెంట్ డ్రైవర్స్, కండక్టర్ మరియు మెకానిక్ , సెక్యూరిటీ సిబ్బందితదితరులు పాల్గొన్నారు
