డ్రైనేజీ పై, సెట్ బ్యాక్ లేకుండా ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు
ఖాళీ స్థలం ఉన్న యజమానులకు వి.ఎల్.టి.( Vacant land tax) విధించి పన్ను వసూలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సోమవారం హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం లో పట్టణంలో ఓపెన్ ప్లాట్లు కలిగి ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేసి ఖాళీ స్థలం కలిగి ఉన్న యజమానులు ప్లాట్లను చదును చేసుకోకపోతే వారిపై మున్సిపల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నూతనంగా నిర్మిస్తున్న భవనాల వలన, డ్రైనేజీ పై వరకు ఉన్న పాత భవన నిర్మాణాల వలన మరియు సెట్ బ్యాక్ లేకుండా కట్టుకున్న భవనాలు ఉండటం వలన వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని ఆ యొక్క అక్రమ భవన నిర్మాణాలపై చర్య తీసుకునుటకు మరియు పట్టణంలోని ఖాళీ స్థలం ఉన్న యజమానులకు వి.ఎల్.టి.( Vacant land tax) విధించి పన్నులు వసూలు చేయాలని పురపాలక సంఘం సభ్యుల దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్స్ బొజు రమాదేవి, కోమటి స్వర్ణలత, చిత్తరి పద్మ, మ్యాదరబోయిన వేణు, గోవిందు రవి , దొడ్డి శ్రీనివాస్,బొల్లి కల్పన, భూక్యా సరోజన, వల్లపు రాజు, బొజ్జ హరీశ్, వాల సుప్రజ, కో ఆప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి, అయుబ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.