హుస్నాబాద్ లో 8, 9 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గల 132/33KV సబ్ స్టేషన్లో మెయింటనెన్స్ పనులు కారణం గా ఈనెల 8, 9 తేదీల్లో ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సప్లై నిలిపి వేస్తున్నట్లు TGSPDCL హుస్నాబాద్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. దీనివలన హుస్నాబాద్ మున్సిపాలిటీ, హుస్నాబాద్ మండలం మరియు అక్కన్నపేట మండలం పరిధిలో గల విద్యుత్ వినియోగదారులకు అంతరరాయం ఏర్పడు తుందని తెలిపారు. కావున దయచేసి విద్యుత్ వినియోగదారులు ప్రతీ ఒక్కరూ గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ లో 8, 9 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
