మిరుదొడ్డి బిజెపి మండల అధ్యక్షుడిగా జిగిరి అమర్ ఎన్నిక
– పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా
– రానున్న ఎన్నికల్లో గ్రామ గ్రామాన బిజెపి జెండా ఎగరడం ఖాయం
– నాకు ఈ పదవి ఇవ్వడానికి సహకరించిన ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తానని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిరుదొడ్డి మండల పార్టీ నూతన అధ్యక్షులు జిగిరి అమర్ అన్నారు. గురువారం రోజున పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ…. జిల్లా అధ్యక్షుని నేతృత్వంలో జరిగిన ఆయా మండలాల నూతన అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించగా, నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షునికి మరియు సహకరించిన మండల బిజెపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ గ్రామాన బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తానని వారన్నారు. ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేనీ రఘునందన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రఘునందన్ రావు ఆశయాల మేరకు పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమం అయినా విజయవంతంగా చేస్తానని, పార్టీ కోసం నిరంతరం కృషి మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలపేతం చేస్తానన్నారు. నా పదవికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు.
Posted inదుబ్బాక
మిరుదొడ్డి బిజెపి మండల అధ్యక్షుడిగా జిగిరి అమర్ ఎన్నిక
