ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై గుడ్ల దాడి..
కొండ సురేఖ పై అనుచిత వాక్యాలు చేసినందుకు..
సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి

కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల నేడు దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రానున్న విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని ఎమ్మెల్యే వాహనంపై గుడ్లతో దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలను వారించిన ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కొనసాగించారు. వారిని సముదాయించేందుకు పోలీసులు నానా తంటలు పడ్డారు. దీంతో బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై చెప్పు లేపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఒక్కసారిగా దుబ్బాకలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏది ఏమైనా దుబ్బాకలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా కొనసాగుతుంది.
