రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా బీజేపీ పార్టీ పిలుపు మేరకు హుస్నాబాద్ నియోజక వర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ జనగామ వేణుగోపాల్ రావ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం మరియు నిరసన కార్యక్రమం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి బడ్జెట్ లో నిధులను కేటాయించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అని దుయ్యబడుతూ అన్ని రకాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకపోతే రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి తోట స్వరూప, ఎస్సి మోర్చా అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, ఓబీసీ మోర్చా సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ మండల అధ్యక్షులు వెల్డండి రాజేంద్ర ప్రసాద్, అక్కన్నపేట, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి, పైడిపెల్లి శ్రీనివాస్ గౌడ్, పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొల్లపెల్లి వీరాచారి, సిద్ధిపేట జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, హుస్నాబాద్ పట్టణ & మండల ప్రధాన కార్యదర్శులు రాయికుంట చందు, తగరపు లక్ష్మణ్, & భూక్య సంపత్ నాయక్, మహేశ్వర్ రెడ్డి మరియు గాదాసు రాం ప్రసాద్, పోలోజు రాజు, వరియోగుల అనంత స్వామి, రవీందర్, వడ్డేపల్లి లక్ష్మయ్య, ఆకోజు అరుణ్, పూదరి కిష్టయ్య, నార్లాపురం సత్యం, వెల్డండి సత్యనారాయణ, చంద్రమౌళి , బొమ్మగాని జగన్నాథం, బొల్లి సుధాకర్, వెల్డండి సంతోష్, సుమన్ , రాకేష్ రెడ్డి, చొక్క అరెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.