నిరుద్యోగులకు అండగా విద్యావేత్త డాక్టర్ ప్రసన్న హరికృష్ణ
స్వగ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు..
జిల్లా గ్రంథాలయానికి స్టడీ మెటీరియల్ పంపిణీ
సిద్దిపేట టైమ్స్ సిరిసిల్ల/బోయినపల్లి:

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అండగా నిలిచేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, విన్నర్ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన సొంత గ్రామమైన గుండన్నపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 1000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు.
ఉచిత శిక్షణకు హామీ..
సిరిసిల్ల జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన, అభ్యర్థులకు అవసరమైన పోటీ పరీక్షల మెటీరియల్‌ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా యువతతో ముచ్చటిస్తూ.. “సమయం చాలా విలువైంది. నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు శ్రద్ధతో చదివి ఉద్యోగాలు సాధించాలి. సిలబస్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త మెటీరియల్‌ను కూడా ఉచితంగా అందిస్తాను. అవసరమైతే తానే ఇక్కడ ఉండి ఉచిత శిక్షణ ఇస్తానని” స్పష్టం చేశారు. ఈ ప్రాంతవాసిగా యువత విజయాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు.
సేవా పథంలో..
అంతకుముందు గుండన్నపల్లి పాఠశాలలో విద్యార్థుల కోసం తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సుమారు 300 మంది రోగులకు, వివిధ పాఠశాలల్లోని 400 మంది విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. విద్యా, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ సేవా యజ్ఞాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో అభిమానులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





