సోనియా,రాహుల్ గాంధీ లపై కుట్రతోనే ఈడి వేధింపులు
గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు నశించాలి
ప్రతిపక్షాల వేధింపులకే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుతున్న బిజెపి
హుస్నాబాద్ లో బీజేపీ కి వ్యతిరేకంగా భారీ ధర్నా లో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోనియాగాంధీ , రాహుల్ గాంధీ లపై కుట్రతోనే ఈడి పేరుతో వేధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి చార్జి షీట్లకు నిరసనగా బీజేపి కి వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నేతలు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. మోడీ కుట్రపూరిత వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశం తర్వాత బీజేపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతుందన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఉంటే ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈడీ కేసుల పేరుతో చార్జి షీట్ ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలని అనుకుంటే ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసింది వాళ్లు అవినీతికి పాల్పడకపోయేదా అని అన్నారు. 85 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి రాజ్యాంగాన్ని రక్షించాలని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పార్లమెంటులో మాట్లాడుతుంటే అహ్మదాబాద్ సభతో బీజేపి ఎక్కడ దెబ్బతింటుందో కాంగ్రెస్ ఎక్కడ పెరుగుతుందో అని అధైర్యపరచడానికి ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబమే అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టండి కానీ కాంగ్రెస్ బలపడుతుంది అని ఇలా ఈడీ కేసులతో ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు? దేశంలో అనేకమంది నీరవ్, మోడీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు ఎందుకు లేవన్నారు. దేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి, ఎయిర్ పోర్ట్ , పోర్టులు, రైల్వేలు, ఆర్థిక సంస్థలు, అన్ని అలానే అంబానీలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నెహ్రూ కుటుంబం పై బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఖండించాలన్నారు. గాంధీ కుటుంబం పై నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.