అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ఇండ్లల్లోకి వరదనీరు
హుస్నాబాద్ వరద నీరు డ్రైనేజీ ద్వారా పందిల్ల రోడ్డు ఎల్లమ్మ వాగులోకి మల్లిచండి
మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నివసించే ఇండ్లల్లోకి వ్యాపారుల దుకాణాల్లోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి పోయి ఆర్థిక నష్టం వాటిల్లి ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు.
సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పట్టణంలో పారుశుద్యం చాలా వరకు పెరుకపోయి డ్రైనేజీలు పూర్తిగా మట్టితో నిండిపోయి వుండడంతో వర్షాలకు పైనుండి వచ్చే వరదంతా ప్రజలు నివసించే గృహాలు, వ్యాపారస్తుల దుకాణంల్లోకి చేరి భారీ నష్టం వాటిల్లిందని గడిపె మల్లేశ్ అన్నారు. మున్సిపల్ అధికారులు పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు ప్రజలకు జరిగిన నష్టమే మున్సిపల్ అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని గడిపె మల్లేశ్ విమర్శించారు.
భవిష్యత్తులో వర్షాలకు వచ్చే వరదనీరు ఏమాత్రం రోడ్ల మీదకు రాకుండా ప్రజలకు వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా స్దానిక కౌన్సిలర్లు పట్టణ ప్రజలు రాజాకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు సేకరించి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి ఇంకేప్పుడు పట్టణంలోకి వరద నీరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీరు రాకుండా డ్రైనేజీ ద్వారా పందిల్ల బ్రిడ్జి వద్దనున్న రేణుకా ఎల్లమ్మ వాగు వరకు డ్రైనేజీ నిర్మాణం చేసి వరద నీరు వాగులోకి చేరేలా వెంటనే తగు చర్యలు చేపట్టాలని అందుకు కావలసిన నిధులు మంజూరు కొసం రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ కృషి చేయాలని గడిపె మల్లేశ్ కోరారు.





