హుస్నాబాద్‌లో “నషా ముక్త భారత్” ర్యాలీ
Say No to Drugs – Say Yes to Life సందేశంతో విద్యార్థుల అవగాహన కార్యక్రమం


సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు “నషా ముక్త భారత్” కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘ కమిషనర్ టి. మల్లికార్జున్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో కలిసి “Say No to Drugs – Say Yes to Life” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, “యువతే దేశ భవిష్యత్తు. సమాజం అభివృద్ధి, దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య రహిత భారత ప్రచారంలో భాగస్వామ్యం కావాలి,” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ నుండి CI శ్రీనివాస్, SI లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్పర్సన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, పున్న సది, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మాదకద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ర్యాలీ విజయవంతంగా ముగిసింది. మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను దూరంగా ఉంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని హుస్నాబాద్ ప్రజలు అభిప్రాయపడ్డారు.





