డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. మంత్రి పొన్నం

డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. మంత్రి పొన్నం

డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

రహదారి మరియు డ్రైనేజ్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్ పై చర్యలు

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి & షాపులలోకి నీళ్ళు వచ్చిన ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై స్థానిక నాయకులు, అధికారులతో  కలిసి సమస్యాత్మక ప్రాంతాలైన మల్లెచెట్టు చౌరస్తా , అనభేరీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్డు, పోతారం రోడ్డు వద్ద నాళాలను & కల్వర్టు లను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ… ఎల్కతుర్తి నుండి సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ లో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు & షాపులోకి నీళ్లు వచ్చాయని, పాత డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడం జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రహదారి పనులు పట్టణంలో వేగవంతం చేయడానికి  స్థానికులు సహకరించాలని, పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో హుస్నాబాద్ లో వర్ష ప్రభావంతో ఇళ్లలోకి షాపులలోకి నీళ్ళు వచ్చాయని, సాయంత్రం లోపు అన్ని కాలువలు నుండి నీళ్ళు పోయేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇబ్బందులు ఉన్న భూముల యజమానులతో మాట్లాడుతూ, పట్టణంలో ఇళ్లలోకి దుకాణాల్లోకి నీళ్ళు పోకుండా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. ప్రతి కల్వర్టు దగ్గర మున్సిపల్ సిబ్బందిని పెట్టి వర్షం పడినప్పుడు నీళ్ళు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బస్వాపూర్, పందిళ్ళ బ్రిడ్జి, హుస్నాబాద్ నుండి పోతారం రహదారి విస్తీర్ణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి రోజు రహదారి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను అని అన్నారు. రహదారి పనులు కోఆర్డినేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో అధికారులను కోరారు.

రహదారి మరియు డ్రైనేజ్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్ ఓనర్ లు మొరం పోసుకొని, నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్ లైట్ ల కోసం తీర్మానం చేసి కనెక్షన్ అప్లై చేసుకొని సెంట్రల్ లైటింగ్ వెలిగించుకోవాలని, తక్షణ కర్తవ్యంగా పట్టణంలో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకుండా కాలువలు క్లియర్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *