కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..
ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
సిద్దిపేట జిల్లా ఆర్టీఏ ( రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ) మెంబెర్ గా సిద్దిపేటకు చెందిన సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు డాక్టర్ లక్కరసు సూర్య వర్మ నియమితులయ్యారు.
ఈ మేరకు లక్కరసు సూర్య వర్మని బీసీ సంక్షేమం మరియూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియమకా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కష్ట సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకి తగిన ప్రాముఖ్యత ఉంటుందనీ దానికీ సూర్య వర్మ ఉదాహరణ అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో నామినేట్ పదవులలో బీసీలకు అవకాశాన్ని కల్పిస్తూ నియోజకవర్గంలోని మొదటిగా డాక్టర్ సూర్య వర్మను నియమిస్తూ శుకరవారం నియామక పత్రం అందజేసి ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో ఈ నియమకాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
డాక్టర్ సూర్య వర్మ మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో కష్టపడుతున్న ప్రతి కార్యకర్తలను గుర్తించి వారికి సరైన సముచిత స్థానం కల్పిస్తున్నందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు.
