ఎవరిని నమ్మిన ఏమి ఫలము లేదు ఇగ ఎర్రజెండా దప్ప దారి లేదు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే స్పందించాలి.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో నిరు పేదలకు కట్టి ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో సుమారు 100 ఇండ్లకు పైగా పూర్తి చేయకుండానే ఆగమేఘాల మీద లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఇండ్లు పూర్తి కానీ లబ్దిదారులు శుక్రవారం నాడు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ ను హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి,సింగిరెడ్డి అమరుల భవన్ లో స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల బాధితుల గోడు విని వెంటనే స్పందించిన గడిపె మల్లేశ్ విలేఖరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే బిసి సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ స్పందించి డబుల్ బెడ్ రూం ఇండ్ల బాధితుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని గడిపె మల్లేశ్ కోరారు.
ఈకార్యక్రమంలో జాగీరి మల్లవ్వ, పున్న కళావతి, ఇల్లందుల పద్మ, పున్న లక్ష్మి, మెగిపాక అనిత, పంతం సుగుణ, ముడికే కనుకవ్వ తదితరులు పాల్గొన్నారు.