యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు
గంజాయి ఇతర మత్తు పదార్థాల పై పటిష్టమైన నిఘా
గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలి
హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

గంజాయి ఇతర మత్తు పదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ హుస్నాబాద్ పట్టణంలో పలు అనుమానస్పద ప్రాంతాలలో సోమవారం రోజు హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, మాట్లాడుతూ… గంజాయి ఇతర మత్తు పదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. సోమవారం రోజు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో కిరాణా షాపులలో బేకరీలలో టీకొట్లలో పాన్ డబ్బాలు మరియు తదితర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్, 1908 లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోడాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.