ప్రజాపాలన అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పై దాడులు చేయడమేనా….
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తున్నాం..
హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లిఖార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మాది ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుందని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం హైదరబాద్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు దాడి చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ నాయకులు అధికారం లో ఉన్నాం అనే బలంతోనే ఇష్ట రాజ్యాంగ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా వరద బాధితులను పార్టీ పక్షాన ఆదుకుందామని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని వరద బాధితులను కలిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ల కార్ల పై రాళ్ళ దాడి, అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదని బిఆర్ఎస్ పార్టీ కీ తెలంగాణ రాష్ట్రం సాధించిన చరిత్ర ఉందనీ తెలియజేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే ఎమ్మెల్యే పై దాడులు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.