నిజాం రజాకార్లకు, భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య
దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఆరెపల్లి లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో భాగంగా అమర వీరుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమురయ్య అని అన్నారు. నిజాం రజాకార్లకు, భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమర వీరుడు, బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత, పోరాటాల ద్వారా చరిత్రలో నిలిచిన ఆదర్శప్రాయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు.
పోరాటం చేయకుండా చరిత్రతో కలిసి నడిస్తే మిగిలేది ఏమి ఉండదని, అనేక సమస్యలకు ఎదురొడ్డి పోరాడి చరిత్రలో నిలిచే విధంగా స్ఫూర్తినిచ్చిన దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, యువత దొడ్డి కొమురయ్య చైతన్య స్ఫూర్తిని, ధైర్య సాహసాలను పునికి పుచ్చుకొని బడుగు, బలహీన వర్గాల ఆశయ సాధన కోసం పోరాడాలనీ వారి జీవిత చరిత్ర ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.