హుస్నాబాద్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ ఉద్యమకారుడు దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సందర్భంగా గురువారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచితమైన పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య యొక్క స్ఫూర్తిని మరవలేమని, వారి యొక్క ఆశయం గురించి ఆశయ సాధన గురించి రాజకీయ నాయకులు అందరూ కూడా పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్సాంగ్ జిల్లా ఉపాధ్యక్షులు కవ్వా వేణుగోపాల్ రెడ్డి, కురుమ సంఘ నేతలు పేర్ల వీర్ల లింగయ్య, సురా ఐలయ్య, మేకల ఓదయ్య, చెంచు సంపత్, చెంచు శ్రీను, సూరు సంపత్, సూరు రంజిత్, పెద్ది సది తదితరులు పాల్గొన్నారు.