పూల్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పరిధిలోని పూల్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హుస్నాబాద్ ప్రాణదాత పిల్లల హాస్పిటల్ డాక్టర్ సప్తఋషి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు స్టేషనరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు నోట్ బుక్స్ ఇవ్వడం వల్ల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ప్రాణదాత హాస్పిటల్ నిర్వాహకుడు రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్నారు. పేద విద్యార్థులను ప్రోత్సాహించేందుకు ఉచితంగా నోట్ బుక్స్, స్టేషనరీ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసి చైర్మన్ భారతి, భూక్యా రవి, సంపత్, రమేష్, వి.వెంకట్రామిరెడ్డి, బార్మవత్ శంకర్ మరియు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.