సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బెజ్జంకి వరలక్ష్మి, ఏక్స్ ఆఫీసుయో నెంబర్ దొడ్డి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కొండ్లె వాసుదేవ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ పిల్లలు ప్రభుత్వం కల్పించే ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనము, రాగి జావా మరియు కోడిగుడ్డు వంటి వసతులను ఉపయోగించుకొని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనలతో పిల్లలంతా మంచి విద్యావంతులై ఈ పాఠశాలకు, ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని జీవితంలో అభివృద్ధిని సాధించాలని కోరారు.
వైస్ చైర్మన్ ఐలేని అనిత మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుంటే ఇంకా మంచి సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని ఇప్పటికీ డెస్క్ టేబుల్స్ యూనిఫార్మ్స్, ఫిల్టర్ మంచి నీరు అందించడానికి ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేస్తామని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బెజ్జంకి వరలక్ష్మి మాట్లాడుతూ బడి ప్రారంభానికి ముందే పాఠశాలలో అవసరమగు తరగతి గదుల డోర్స్, విండోస్ మరమ్మతు చేపించడం జరిగింది అని, అన్ని తర గ తి గ దులలో ఫ్యాన్స్ ఏర్పాటు చేశామని, టాయిలెట్స్ మరమ్మతులు మరియు నీటి వసతికి పైప్ లైన్ మరమ్మతులు చూపించామని అన్నారు. మా కమిటీ, మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో పాఠశాలకు అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు. సౌకర్యాలు కల్పించుట మా వంతు చదువుకొని ప్రగతిని చూపించటం మీ వంతు అని విద్యార్థులకు చెప్పారు.