సిద్దిపేటలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయండి..
హరీశ్ రావు పిటిషన్ పై హైకోర్టు ఆదేశం..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్:
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథక లబ్ధిదారుల మంజూరైన చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారుల కు అందించక పోవడంతో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు లబ్ధిదారుల కు చెక్కులు పంపిణీ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సిద్దిపేట నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయాలని హైకోర్టు బుధ వారం అధికారులను ఆదేశించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే హరీశ్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్.చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ మౌఖిక ఆదేశాలతో లబ్ధిదారు లకు చెక్కులు అందించలేదని, గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు అన్న రాజకీయ దురుద్దే శంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రక్రియను అడ్డుకుం టోందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 474 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, గడువు దాటితే అవి చెల్లక లబ్దిదారులు నష్టపోతారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటి గడువు సెప్టెంబరు నెలాఖరు వరకు ఉందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సిద్ది పేట నియోజకవర్గంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందించాలని అధి కారులను ఆదేశించారు.





