పార్టీ పరిధి దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు…
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతూ కొంత మంది నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న తీరు సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ తో గెలిచిన నాయకులు పార్టీ నిర్ణయాలను పట్టించుకోకుండా పట్టణానికి చెందిన కొందరు పార్టీ కౌన్సిలర్ లు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ ఆదేశాలను పార్టీ నాయకులు ఎవరైనా ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనీసం ఇప్పటికైన కొంత మంది పార్టీ నాయకులు వ్యవహరించే తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి, పార్టీ నాయకులు యాస శ్రీనివాస్, కందుకురి సతీష్, మాటూరి ప్రేమ్ కుమార్, భూక్యా రాజు నాయక్, పెట్టుగాడి కనుకరాజు, శివ, రాము తదితరులు పాల్గొన్నారు.