హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో నేడు డయల్ యువర్ డిఎం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం నిర్వహిస్తున్న “డయల్ యువర్ డి ఎం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిపో మేనేజర్ ఎన్ వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే “7382852772” నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే సలహాలు సూచనలు తెలియజేయాలని, హుస్నాబాద్ డిపో పరిధిలో ఉన్న ప్రయాణికులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.