ధ్యాన్ చంద్ జీవితం ఆదర్శప్రాయం….
అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు నాగిరెడ్డి సిద్ధారెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జీవితం ఒక ఆదర్శప్రాయమని అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు నాగిరెడ్డి సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్, జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో క్రీడా సంబరాలలో భాగంగా బుధవారం నిర్వహించిన క్రీడా దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మేజర్ ధ్యాన్‌చంద్ సామాన్యమైన నిరుపేద కుటుంబంలో జన్మించి తను ఎంచుకున్న క్రీడారంగంలో అంచెలంచెలుగాగ ఎదిగి అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు ..దేశానికి పథకాలు సాధించి పెట్టి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు….. మామూలు సైనికుడిగా ప్రారంభించిన ఆయన జీవితం క్రీడారంగంలో దేశానికి చేసిన సేవలుకు గానూ అత్యున్నత పురస్కారంతోపాటు ఆయన పేరు మీద ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు క్రీడా పురస్కారాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం ప్రతి యేట జాతీయ క్రీడా దినోత్సవం సంబరాలు జరుపుకునేలా చేసింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చిన్నారి విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం నానుడి మేరకు క్రీడల్లో పాల్గొని చక్కటి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలని అన్నారు… నిత్యం గనుక ఆటలాడినట్లయితే చక్కటి శరీర సౌష్టవం తో పాటు మానసిక ఎదుగుదల లభిస్తుందని ఆయన చెప్పారు… ఆటలతోపాటు చదువులోనూ రాణించినట్లైతే చక్కటి భవిష్యత్తు ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతుల జ్యోతి అన్నారు. స్పోర్ట్స్ ద్వారా రిజర్వేషన్లు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎదిగే ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వ్యాయామ విద్య ఉపాధ్యాయులు జంగపల్లి వెంకట నరసయ్య క్రీడల ప్రాధన్యత ను తెలియజేస్తూ క్రీడాకారులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కాగా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామన్ బాబు, నోముల చంద్రారెడ్డి, అడేపు శ్రీనివాస్, శంకర్ నాయక్, కృష్ణకుమారి, రైసా నస్రీన్, రమాదేవి , ఏవిఆర్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.